ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ మాథ్యూ వేడ్ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌కప్‌లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వేడ్.. తన 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 36 టెస్ట్‌లు, 97 వన్డేలు, 92 టీ20లు ఆడి 4700 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.రిటైర్మెంట్ సందర్భంగా వేడ్ తన సహచరులతో పాటు కోచింగ్ స్టాఫ్‌కు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. 36 ఏళ్ల వేడ్ ఆస్ట్రేలియా గత వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. వేడ్‌కు ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.పాకిస్తాన్ జట్టు నవంబర్ 4 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో పాక్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. నవంబర్ 4, 8, 10 తేదీల్లో మూడు వన్డేలు జరుగనుండగా.. నవంబర్ 14, 16, 18 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల అనంతరం ఆస్ట్రేలియా స్వదేశంలో భారత్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతుంది. కీలకమైన ఈ సిరీస్‌ల ముంగిట మాథ్యూ వెడ్ రిటైర్మెంట్ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
Share