Current Date: 25 Nov, 2024

మానవత్వం మరిచిన జనం.. యాక్సిడెంట్‌లో ఫొటోలు తీస్తూ కాలయాపన

రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. ఆసుపత్రికి తరలించండి.. అంటూ బాధితుడు ప్రాధేయపడినా చుట్టూ ఉన్న జనం సాయం అందించలేకపోయారు. 108 వాహనం వచ్చేవరకూ.. ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ గడిపేశారు. కాసేపటికి వచ్చిన 108లో సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణం పోయింది. కీసర సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం వరంగల్‌కు చెందిన వి.ఏలేందర్‌ (35) కీసర సమీప రాంపల్లి చౌరస్తాలో నివాసం ఉంటున్నారు. బుధవారం సాయంత్రం కీసరలో తాను నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటీపై వెళుతుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఎలేందర్‌ రోడ్డుపై పడిపోగా.. స్థానికులు గమనించి కేకలు వేశారు.  ఉండిపోయారు. కాసేపటికి 108 వాహనం రాగా.. ఈసీఐఎల్‌ చౌరస్తాలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాధితుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

Share