టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను గ్రౌండ్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టబోయాడు. ఆదివారం రాత్రి భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో సుందర్ పదే పదే ఒకే తప్పిదం చేస్తూ కనిపించాడు. దాంతో సహనం కోల్పోయిన రోహిత్ శర్మ.. కోపంగా అతని వైపు దూసుకెళ్లాడు. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న టైమ్‌లో సుందర్ 32వ ఓవర్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. తొలి బంతిని బాగానే వేశాడు. కానీ రెండో బంతి వేసేముందు ఏమైందో ఏమో కానీ.. రెండు సార్లు బంతి వేసేందుకు రనప్‌తో వచ్చి ఆగిపోయాడు. దాంతో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్.. వాషింగ్టన్ సుందర్‌ను కొట్టేందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. బౌలర్ ఇలా సమయం వృథా చేస్తే.. స్లో ఓవర్ రేట్ కింద కెప్టెన్‌కి మ్యాచ్ రిఫరీ జరిమానా విధిస్తారు. మ్యాచ్ ఫీజులో 10 శాతం నుంచి 30 శాతం వరకూ కోత పడే ప్రమాదం ఉంది. దాంతో రోహిత్ కోప్పడ్డాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది.
Share