Current Date: 25 Nov, 2024

ఒకే వేదికపై ప్ర‌త్య‌క్ష‌మై అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన‌ నయనతార, ధనుశ్‌...

కోలీవుడ్ న‌టులు నయనతార, ధనుశ్ వివాదం నెట్టింట వైర‌ల్ అవుతున్న విష‌యం తెలిసిందే. దానికి కార‌ణం నయనతార త‌న‌ డాక్యుమెంటరీలో వాడిన మూడు సెకన్ల నిడివి క‌లిగిన‌ క్లిప్పింగ్‌. దాంతో ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఒకరినొకరు దోషిగా చూపిస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో చెన్నై వేదికగా జరిగిన ఒక వివాహ వేడుకకి ఇద్దరు స్టార్లు హాజరై అంద‌రినీ ఆశ్చర్యపరిచారు. టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాశ్‌ భాస్కర్ వివాహ వేదిక‌పై ఇలా న‌య‌న్‌, ధ‌నుశ్ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఆకాశ్‌ భాస్కర్ పెళ్లికి తొలుత ధనుష్ హాజరవగా.. ఆ తర్వాత నయనతార కూడా తన భర్త విఘ్నేశ్ శివన్‌తో క‌లిసి వచ్చారు.  ఇక సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌వారికి వివాహ వేదికలో ముందు వరుస కుర్చీలను కేటాయించారు. దాంతో ధనుశ్‌, నయనతార ఒకే వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. అయితే, ఆ ఇద్దరూ కనీసం ఒకరి వైపు మరొకరు చూసుకోలేదు. వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి కూడా తొలుత సెలెబ్రిటీలు వెళ్లగా.. అక్కడ కూడా నయనతార, ధనుశ్‌ ఎడమొఖం, పెడమొఖంగానే ఉన్నారు.

Share