Current Date: 28 Nov, 2024

నటాషాతో హార్దిక్ పాండ్యా విడాకులు

నటాషాతో నాలుగేళ్ల బంధానికి ముగింపు పలికినట్లు భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా వెల్లడించారు. భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. నటాషా ఇటీవల తన కుమారుడు అగస్త్యను తీసుకొని ముంబై నుంచి సెర్బియాకు వెళ్లిపోయింది. వారిద్దరూ విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో తాము విడాకులు తీసుకున్నట్లు పాండ్యా ప్రకటించారు. పరస్పర అంగీకారంతో నాలుగేళ్ల తమ బంధానికి ముగింపు పలుకుతున్నామని పాండ్యా వెల్లడించాడు. '4 సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత నటాషా, నేను విడిపోవాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నామని, అగస్త్య తమ ఇద్దరితోనూ ఉంటాడని, అతని సంతోషం కోసం మేం తల్లిదండ్రులుగా అండగా ఉంటామని పేర్కొన్నారు.

Share