Current Date: 27 Nov, 2024

అయ్యన్న పై పవన్ కళ్యాణ్ సరదా మాటలు

అల్లరి చేసే అబ్బాయిని  మా చిన్నప్పుడు క్లాస్ లీడర్ ని చేసాం అంటూ  సభలో పవన్ కళ్యాణ్ అయ్యన్న కు చిన్న చురక వేశారు. స్పీకర్ పదవికి ఎన్నికై ఆ కుర్చీలో అయ్యన్న కూర్చున్న తరువాత పవన్ కళ్యాణ్ ఛలోక్తిగా మాట్లాడారు.అయ్యన్న ను ఉద్దేశిస్తూ ఇకపై తిట్టే అవకాశం మీరు కోల్పోయి నందుకు బాధ పడుతున్నా అని అనేసరికి సభలో నవ్వులు విరిసాయి. సభలో ఎవరు తిడుతున్నా ఆపాల్సిన బాధ్యత ఇప్పుడు మీపై పడింది అంటూ అందరినీ నవ్వించారు.చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం.. అల్లరి చేసే వాడినే క్లాస్ లీడర్ ను చేసే వాళ్ళం.. అంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ మాటలు సభలో నవ్వులు పుట్టించాయి.

Share