Current Date: 07 Oct, 2024

బాలయ్య కొడుకు వస్తున్నాడు నందమూరి ఫ్యాన్స్ ఖుష్!

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొద్ది కాలంగా సోషల్ మీడియా వార్తలు వస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీతో రాబోతున్నట్లు నెట్టింట పలు రకాల చర్చలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు.మంచి కథ, దర్శకుడు ఫిక్స్ అయితే తప్పకుండా హీరోగా ఎంట్రీ ఇస్తాడని బాలయ్య పలు సందర్భాల్లో చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా, మోక్షజ్ఞ ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. స్లిమ్‌గా, హ్యండ్‌సమ్‌గా ఉన్న ఫొటో ఫేర్ చేస్తూ ‘‘ వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’’ అని క్యాప్షన్ జత చేశాడు. ఈ ఫొటోలో ఎల్లో కలర్ టీషర్ట్, స్పెట్స్ పెట్టి స్టైలిష్ లుక్‌తో అందరిని మైమరిపిస్తున్నాడు.ప్రజెంట్ మోక్షజ్ఞ చూసిన వారంతా సినీ ఎంట్రీ ఫిక్స్ అయింది కావొచ్చు. అందుకే ఇలాంటి పోస్ట్‌తో హింట్ ఇచ్చాడని అనుకుంటున్నారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎన్టీఆర్ లా మోక్షజ్ఞ కూడా స్టార్ హీరో అవ్వడం ఖాయం అని అభిప్రాయపడుతున్నారు.

Share