Current Date: 07 Oct, 2024

ఏపీ టెట్‌ షెడ్యూల్‌లో కీలక మార్పులు.

AP TET 2024 ఇటీవల ఇచ్చిన టెట్‌ నోటిఫికేషన్‌లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది. సన్నద్ధత కోసం అభ్యర్థులకు మరింత సమయం ఇచ్చేందుకు వీలుగా సవరించింది. రాష్ట్రంలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ (Mega DSC)కి సిద్ధమైన ఏపీ సర్కార్‌ మరోసారి టెట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జులై 2న టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటికీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్‌, డీఎస్సీలకు సన్నద్ధమయ్యేందుకు మరింత గడువు ఇస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టెట్‌ షెడ్యూల్‌లో పలు మార్పులతో సోమవారం సవరించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాత నోటిఫికేషన్‌ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20వరకు టెట్‌ పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని అక్టోబర్‌ 3 నుంచి 20వరకు నిర్వహించాలని నిర్ణయించింది. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే

Share