పవన్ కల్యాణ్ తాజాగా పిఠాపురం అసెంబ్లీకి నామినేషన్ వేశాడు. అందులో ఆయన విద్యార్హతకు సంబంధించిన వివారలను పొందుపరిచి అందరి సందేహాలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. గతంలో ఇంటర్‌కి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా నామినేషన్ పత్రంలో తాను పదో తరగతి మాత్రమే పాసైనట్లు పవన్ క్లారిటీగా పొందుపరిచాడు.
గతంలో తనకు టెన్త్‌లో వచ్చిన మార్కులకు సీట్ రాకపోవడంతో నెల్లూరులోని ఓ ఇంటర్మీడియట్ కాలేజీలో రికమెండేషన్‌తో సీఈసీ తీసుకున్నానని ఓ సభలో చెప్పాడు. కొద్దిరోజుల గ్యాప్‌లోనే తను అనుకున్న సీట్ రాకపోవడంతో వేరే గత్యంతరం లేక ఎమ్‌ఈసీ తీసుకున్నానని మరో సభలో చెప్పాడు.అంతటితో పవన్ చదువు ఆగిపోలేదు ఇంకొక సభలో అయితే స్నేహితులతో కలిసి ఎంపీసీ ట్యూషన్‌కు వెళ్లేవాడినని చెప్పుకొచ్చాడు. దాంతో అసలు పవన్ ఇంటర్మీడియట్ చదివాడా లేదా..? ఒకవేళ చదివితే ఏ గ్రూప్ చదివాడో తెలుసుకోవాలని నెటిజన్లకి ఇంట్రస్ట్ పెరిగింది.
తాజాగా అఫిడవిట్‌లో తాను పదోతరగతి పాస్ అయినట్లు పవన్ పేర్కొన్నాడు. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో 1984లో పదోతరగతి పూర్తి చేసినట్లు పవన్ తెలిపాడు. దాంతో ఇంటర్ ట్రోల్స్‌కి పూర్తిగా తెరపడినట్లయ్యింది.