Current Date: 06 Jul, 2024

జగనన్న పంపిన డబ్బును ఇస్తావా? చస్తావా గుడివాడ ఇంటికెళ్లిన మహిళలు

 ఎన్నికల జరగడానికి ఒక రోజు ముందు గుడివాడ అమరనాథ్‌ ఇంటిని మహిళలు చుట్టుముట్టారు. జగనన్న పంపిన డబ్బుని ఇస్తావా? చస్తావా? అంటూ మహిళలు గుడివాడను నిలదీశారు. అక్కిరెడ్డిపాలెం, నాతయ్యపాలెం మహిళలు గుడివాడ ఇంటి బయటే తిష్ట వేశారు. తమకు డబ్బు అందలేదని, ఇప్పుడే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డబ్బులేవీ లేవు వెళ్ళండి అంటూ గుడివాడ అనుయాయులు చెప్పినా మహిళలు వినిపించుకోలేదు. జగనన్న పంపిన డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఈ విధంగా అనేక ప్రాంతాల నుంచి మహిళలు వస్తూనే వుండడంతో గుడివాడ వారిపై చిర్రుబుర్రులాడడం కనిపించింది. పార్టీల నాయకుల ద్వారా కాకుండా పార్టీకి సంబంధం లేని త్రినాధ్‌ అనే వ్యక్తి ద్వారా పంపకాలను నిర్వహించినట్టు తెలిసింది. అయితే ఈ సొమ్ము సక్రమంగా అందకపోవడంతో మహిళలు గుడివాడ ఇంటిపైనే పడడం ఇక్కడ చర్చనీయాంశమైంది.