Current Date: 05 Oct, 2024

ప్రధాని పదవికి రాజీనామా చేసిన నరేంద్ర మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కొనసాగాలని రాష్ట్రపతి కోరారు. మోదీ ఈ నెల 8న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్వతంత్ర భారతంలో వరుసగా మూడోసారి ప్రధాని కావడం నెహ్రూ తర్వాత మోదీయే కావడం గమార్హం.