Current Date: 07 Oct, 2024

ఉక్కు సీఎండీ సీట్లో కూర్చున్న ఎంపీ శ్రీభరత్

విశాఖ ఉక్కు ఛైర్మన్ సీట్లో ఎంపీ శ్రీభరత్ కూర్చోవడం పట్లతీవ్రవిమర్శలుఎదురవుతున్నాయి.విద్యావంతుడు,ఎన్నో వేల మంది విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పే స్థానం లో వున్న గీతం యూనివర్సిటీ ఛైర్మెన్ అయిన శ్రీభరత్ చిన్న సంస్కారాన్ని విడిచి పెట్టడం పెద్ద తప్పిదంగా కనబడుతోంది.గతం లో ఎప్పుడూ, ఏ ఎంపీ ఈ విధంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. దేశం లోనే ప్రతిష్టా కరమైన ఆర్ఐఎన్ఎల్ నవరత్న కంపెనీ అన్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ కు ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుంది. గతంలో ఎంపీ లుగా వున్న ద్రోణంరాజు(రాజ్యసభ ), సుబ్బారామిరెడ్డీ , ఎంవీవీఎస్ మూర్తి, కంభంపాటి హరిబాబు,పురందేశ్వరి, విజయసాయి రెడ్డి (రాజ్యసభ ),ఎంవీవీ సత్యనారాయణ వంటి వారు కూడా ఉక్కు సీఎండీ లను కలసినప్పుడు వాళ్ళ అధికారిక కుర్చీల్లో కూర్చోలేదు. కానీ ఇప్పుడు శ్రీభరత్ సీఎండీ కుర్చీలో కూర్చుని ఆ సాంప్రదాయాన్ని కాల దన్నారన్నా విమర్శలు వస్తున్నాయి. ఒక వేళ సీఎండీ స్వయంగా పిలిచి తన ఛైర్ లో కూర్చోమని ఆహ్వానించినా  కూర్చోవడం సభ్యత కాదు అన్నది ఉక్కు వర్గాల వాదన

Share