Current Date: 28 Nov, 2024

తాకట్టులో విశాఖ సీపీ ఆఫీస్: హోమ్ మంత్రి అనిత

 గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నమయ్యాయని హోoమంత్రి అనిత గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని సీపీ కార్యాలయం తాకట్టులో ఉందని, సీపీ ఆఫీస్ కు నోటీసు అంటిస్తే పోలీస్ కమిషనర్ ఎక్కడికి వెళ్లిపోవాలని అమరావతిలో ఓ సమావేశంలో భాగంగా ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టులో ఉన్నాయో తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్ని చక్కబెట్టాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని అనిత పేర్కొన్నారు.

Share