Current Date: 22 Sep, 2024

ప్లీజ్ ఒక్క సినిమా చేద్దాం.. తమిళ్ డైరెక్టర్‌కి జూనియర్ ఎన్టీఆర్ రిక్వెస్ట్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంపై దేశవ్యాప్తంగా హైప్ ఉంది. ఈ మూవీ తమిళ వెర్షన్ కోసం చెన్నైలో ప్రెస్ మీట్ జరిగింది. హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు కొరటాల శివ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ ఈవెంట్‍లో పాల్గొన్నారు. “మీ నుంచి డైరెక్ట్ తమిళ చిత్రాన్ని ఎప్పుడు ఆశింవచ్చు. అది వస్తే సెలెబ్రేట్ చేసుకుంటాం” అని ఎన్టీఆర్‌కు ప్రశ్న వచ్చింది. దీంతో నా ఫేవరెట్ డైరెక్టర్‌ను అడుగుతానంటూ వెట్రిమారన్ పేరు చెప్పారు ఎన్టీఆర్.వెట్రిమారన్‍తో డైరెక్ట్ తమిళ మూవీ చేయాలనుందని ఎన్టీఆర్ చెప్పారు. తనతో ఓ చిత్రం చేయాలని ఆయనను రిక్వెస్ట్ చేశారు. “వెట్రిమారన్ సర్. నాతో ఓ సినిమా చేయండి. డైరెక్ట్‌ తమిళ చిత్రం చేద్దాం. తెలుగు డబ్బింగ్ చేద్దాం” అని ఎన్టీఆర్ అన్నారు.ఆడుకాలం, విసారనై, వడాచెన్నై, అసురన్, విడుదలై లాంటి హార్డ్ హిట్టింగ్ తమిళ చిత్రాలు చేశారు దర్శకుడు వెట్రిమారన్. ప్రత్యేకంగా నిలిచారు. వెట్రిమారన్ అంటే తనకు చాలా ఇష్టమని గతంలోనూ ఎన్టీఆర్ చెప్పారు. ఆయనతో చిత్రం చేయాలనుందంటూ ఇప్పుడు అన్నారు.

Share