Current Date: 07 Oct, 2024

ఏపీ ప్రజలకు అలర్ట్

ఏపీ సీఎం చంద్రబాబు ఇలా అధికారంలోకి వచ్చారో లేదో, అలా ప్రభుత్వ వెబ్‌సైట్ల దుమ్ము దులుపుతున్నారు. ప్రజలకు ఉపయోగకరమైన పోర్టల్ ఒకటి తెచ్చారు. ఈ పోర్టల్ పేరు NBM. అంటే.. నవశకం బెనెఫీషియర్ మేనేజ్‌మెంట్. ఈ వెబ్‌సైట్ అధికారిక యూఆర్ఎల్ http://gsws-nbm.ap.gov.in దీన్ని ఏపీ ప్రభుత్వం తేవడానికి బలమైన కారణం ఉంది. గత వైసీపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. కూటమి ప్రభుత్వం తనదైన సంక్షేమ పథకాలను అమలు చెయ్యబోతోంది. అందువల్ల ప్రతీ పథకం కోసమూ కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ప్రజలకు గందరగోళం లేకుండా ఉండేందుకు ఈ పోర్టల్ తెచ్చింది. లబ్దిదారులు వివిధ పథకాలకు సంబంధించి తమ దరఖాస్తుల పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందో తెలుసుకునేందుకు ఈ పోర్టల్‌లో లబ్దిదారు తన ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నంబర్ ఇవ్వగానే.. వారు ఏయే పథకాల కోసం అప్లై చేసుకున్నారో, వాటి ప్రస్తుత స్టేటస్ ఎలా ఉందో చూసుకోవచ్చు. ఆఫీసుకి వెళ్లకుండా.. ఇంట్లోనే ఉంటూ.. మొబైల్ ద్వారా మొత్తం డేటా చూసుకోవచ్చు. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు. పోర్టల్‌లో చూసుకునేందుకు  కొన్ని పత్రాలు అవసరం. రకరకాల పథకాలకు అప్లై చేసుకునేవారు, కొన్ని రకాల పత్రాలను తమ దగ్గర ఉంచుకుంటే, ఈ పోర్టల్‌లో స్టేటస్‌ చూసుకోవడం తేలికవుతుంది. ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, అడ్రెస్ ప్రూఫ్, పాన్ కార్డు, AP CFMS బిల్ స్టేటస్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో ఉండాలి. ఇవన్నీ తప్పనిసరి కాదు. అవసరాన్ని బట్టీ వివిధ పథకాలకు ఉపయోగపడతాయి.

Share