Current Date: 26 Nov, 2024

రుషికొండ ప్యాలెస్‌పై ఎటూ తేల్చుకోలేకపోతున్న కూటమి ప్రభుత్వం

వైసీపీ ప్రభుత్వంలో విశాఖపట్నంలోని రుషికొండ మీద దాదాపుగా రూ.500 కోట్లకి పైగా ఖర్చుతో ప్యాలెస్ నిర్మించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని ఏం చేయాలో అధికారులకి పాలుపోవడం లేదు. రుషికొండ కట్టడాలను మొదటి నుంచి టీడీపీ, జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దాంతో ఆ కట్టడాల విషయంలో పూర్తి వ్యతిరేకంగానే మాట్లాడుతూ వచ్చారు.ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి నేతలు ఎవరైనా అక్కడ ఉంటే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అత్యంత విలాసవంతమైన వాటిని రాష్ట్రపతి, ప్రధాని వంటి అతిధుల విడిదిగా ఉపయోగించుకోవచ్చు చాలా మంది సూచిస్తున్నారు. కానీ.. రుషికొండ ప్యాలెస్ విషయంలో కూటమి ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. పర్యాటక శాఖ మంత్రి జనసేన నేత కందుల దుర్గేష్ విశాఖపట్నంలో పర్యటించగా.. రుషికొండ ప్యాలెస్ గురించి అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం దాటవేశారు. రుషికొండ నిర్మాణాలు చాలా పెద్దవి.. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. 

Share