Current Date: 26 Nov, 2024

నోరుజారిన కొండా సురేఖ మంత్రి పదవి పోతుందా? టీపీసీసీ చీఫ్ క్లారిటీ

తెలంగాణలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అటు రాష్ట్ర రాజకీయాల్లో ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, సమంత విడాకులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద.. ఇటు అక్కినేని కుటుంబం మీద కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయటం తీవ్ర దూమారం రేపాయి. అసలే హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వంపై సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యలో.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పార్టీకి మరింత డ్యామేజ్ చేసేలా ఉన్నాయని భావించిన అధిష్ఠానం.. ఆ చేసిన ఆరోపణలపై వివరణ అడిగి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ కొండా సురేఖ స్వయంగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవటంతో అప్పుడే వివాదం ముగిసిపోయిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీలోనూ ఎలాంటి చర్చ లేదన్నారు. అయితే.. ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా మాత్రం కావాలనే మంత్రి కొండా సురేఖ మీద బుదర జల్లే ప్రయత్నం చేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.

Share