Current Date: 04 Jul, 2024

ఔటిచ్చిన అంపైర్లని తిట్టిన విరాట్ కోహ్లీ.. శిక్ష తప్పదా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. తనని ఔట్ ఇచ్చిన అంపైర్లపై కోపంతో నోరు పారేసుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.

ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా హర్షిత్ రాణా వేసిన మూడో ఓవర్‌లో విరాట్ కోహ్లీ అతనికే
రిటర్న్ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. హై ఫుల్‌టాస్‌గా వేసిన ఈ బంతి కోహ్లీ ఛాతి కంటే ఎత్తులో రాగా.. అతను డిఫెండ్ చేశాడు. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేవగా.. హర్షిత్ రాణా అందుకున్నాడు. అంపైర్లు ఔట్ ఇవ్వగా.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ.. నోబాల్ అంటూ రివ్యూ తీసుకున్నాడు.

అయితే బంతి నడుము కంటే ఎత్తులో వచ్చినా కోహ్లీ క్రీజు బయట ఉన్నాడని, బంతి డిప్ అయ్యిందని పేర్కొంటూ థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైదానంతో వీడుతూ సహనం కోల్పోయిన కోహ్లీ.. అంపైర్ల వద్దకు వెళ్లి నోరు పారేసుకున్నాడు. దాంతో కోహ్లీకి మందలింపుతో పాటు జరిమానా పడే అవకాశం ఉంది.