విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రెచ్చగొడుతున్నారని ప్రతిపక్ష నాయకులపై ఆయన మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. గతంలో కూడా ఇలాంటి సందర్భం వస్తే మేమే అడ్డుకున్నామని గుర్తు చేశారు. ఈరోజు కేంద్రమంత్రి కుమార స్వామితో మాట్లాడానని, కొంత డబ్బు ఇచ్చి ప్లాంట్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారని చంద్రబాబు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో బాధ్యతగా వ్యవహరిస్తామన్నారు చంద్రబాబు. ప్లాంట్ ను ఎలా కాపాడుకోగలమో అలా కాపాడుకుంటామన్నారు. ఎన్డీయే కూటమికి విశాఖ చాలా ముఖ్యమైన నగరం అని చంద్రబాబు చెప్పారు.
Share