వైఎస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మొదటి భర్త మదన్మోహన్ దిల్లీలో ధర్నా చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వైఎస్సార్సీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్ డీఎన్ఏ టెస్టుకు ముందుకు రావాలంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మొదటి భర్త డిమాండ్ చేశారు. తన భార్యకు పుట్టిన కుమారుడి విషయంపై వివాదం తీరాలని దిల్లీలో ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన భార్యను చెరబట్టారంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మొదటి భర్త మదన్ మోహన్ మణిపట్టి ఆవేదన వ్యక్తం చేశారు. తాను విదేశాల్లో ఉంటున్న సమయంలో ఆమెతో సంబంధం పెట్టుకుని వేల ఎకరాల దేవాదాయ శాఖ భూములను ఆక్రమించారని మదన్ మోహన్ తెలిపారు. విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా బుధవారం ఆయన ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసన తెలిపారు. విజయ సాయిరెడ్డి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.