Current Date: 02 Jul, 2024

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు ఏపీ క్యాబినెట్‌ నిర్ణయం

క్యాబినెట్‌ భేటీలో చర్చకు వచ్చిన మరో ముఖ్యమైన అంశం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌. ఈ చట్టం రాకతో భూ యజమానులందరూ ఉలిక్కిపడ్డారు. పిడుగు పడ్డట్టు భయపడిపోయారు. గత ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ఒక ఉదాహరణ. భూ వివాదాలను తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టం తీసుకువచ్చింది. బీజేపీ తీసుకువచ్చిన చట్టాన్ని మేం అమలు చేశామని గత  ప్రభుత్వం చెప్పింది. అయితే, కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టానికి, మన రాష్ట్రం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒక్కటి కూడా ఈ చట్టాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. కానీ వైసీపీ మాత్రం ఆదరాబాదరాగా ఈ చట్టాన్ని తీసుకువచ్చి సన్న, చిన్నకారు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. మొదట పాస్‌ పుస్తకాలపై ఆయన ఫొటో ముద్రించడం, ఆ తర్వాత సర్వే రాళ్లపైనా అతడి ఫొటో, పేరు రాయడం చూసిన తర్వాత ఇవన్నీ కూడా ఏదైనా కుట్రలో భాగమా అని అనుమానాలకు దారితీసింది. ఈ చట్టంలో పేర్కొన్న టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ పాత్ర సందేహాలకు తావిచ్చే విధంగా ఉంది. 

Share