Current Date: 28 Nov, 2024

ఫోన్‌పే, గూగుల్‌పేలో కరెంటు బిల్లు కట్టొద్దు

ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యూపీఐ యాప్‌ల ద్వారా ఇప్పటి వరకు విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులకు షాక్‌ తగిలింది. ఈ నెల నుంచి వాటి ద్వారా విద్యుత్‌ బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపు సేవలను ఆ యాప్‌లు నిలిపేశాయి. ఈ నేపథ్యంలో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి సంబంధిత విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కం) వినియోగదారులు మొబైల్‌ ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని బిల్లులు చెల్లించాలని సూచించాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఆయా చెల్లింపు సంస్థలు జులై ఒకటో తేదీ నుంచి బిల్లుల చెల్లింపు సేవలు నిలిపేశాయి. దీంతో విద్యుత్‌ వినియోగదారులు ప్రతినెలా బిల్లు చెల్లింపు కోసం ఆయా డిస్కం వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ను వినియోగించక తప్పని పరిస్థితి ఏర్పడిరది.

Share