Current Date: 02 Jul, 2024

రిలీజ్‌కు ముందే క‌ల్కి సంచ‌ల‌నం USAలో రికార్డుల మోత‌

ప్ర‌భాస్ న‌టించిన‌ క‌ల్కి 2898 ఏడీ చిత్రం భారీ అంచ‌నాల మ‌ధ్య కొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే ఈచిత్రం ఇంకా విడుద‌ల కాక ముందే అమెరికాలో రికార్డుల సునామీ సృష్టిస్తోంది.ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాపై విప‌రీత‌మైన బ‌జ్ ఏర్ప‌డింది. దానికి తోడు. ప్ర‌మోష‌న్ కంటెంట్‌తో చిత్ర‌బృందం ఆ అంచ‌నాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు రెట్టింపు చేస్తోంది.తాజాగా ఈచిత్రం ఇంకా విడుద‌ల కాక ముందే రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇంత‌వ‌ర‌కు ఇండియాలో ఎలాంటి స్టార్ హీరోకు సాధ్యం కానీ విధంగా అమెరికాలో ప్రీమియ‌ర్స్‌ కు ల‌క్ష‌ల్లో టికెట్ల సేల్స్ జ‌రిగి స‌రికొత్త చ‌రిత్రను తిర‌గ‌రాసింది. ఈ మేర‌కు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌ట‌న కూడా చేశారు. రిలీజ్‌కు ముందు, త‌ర్వాత ఫాస్టెస్ట్‌గా 3 మిలియన్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించిన తొలి భార‌తీయ చిత్రంగా క‌ల్కి రికార్డు నెల‌కొల్పింది.

Share