Current Date: 04 Jul, 2024

రేవ్ పార్టీ అంటే ఏంటో తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా బాగా వినిపిస్తోన్న మాట రేవ్ పార్టీ. బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఉన్నారని.. అందులోనూ రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. రేవ్ పార్టీల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రజల్లో కనిపిస్తోంది.

అసలు ఈ రేవ్ పార్టీలంటే ఏంటీ.. ఇందులో కేవలం సెలెబ్రెటీలే ఎందుకు పాల్గొంటారు..? అసలు ఆ పార్టీలో ఎలాంటి పనులు చేస్తారు..? అనేవి చాలా ఇంట్రస్టింగ్ టాపిక్‌గా మారిపోయాయి. రేవ్ పార్టీ కల్చర్‌ అనేది 1950లో ఇంగ్లండ్‌లో మొదలై.. మెల్లిగా ప్రపంచమంతా వ్యాపించింది. ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తల్లో.. క్లోజ్డ్ ఏరియాలో పెద్దగా మ్యూజిక్‌ పెట్టుకోనో, లేదా లైవ్ పర్‌ఫార్మెన్స్ ఇవ్వటమే.. దానికి మైమరిచిపోతూ డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేయటం ఉండేది. ఇక.. పాశ్చత్య దేశాల్లో సాధారణంగానే మద్యం సేవించే అలవాటు ఉండటంతో.. అది కూడా కంటిన్యూ అయ్యేది. కాగా.. రాను రానూ ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తోంది. వైల్డ్‌ బిహేవియర్‌తో చేసుకునే పార్టీలకు రేవ్‌ పార్టీలు అని పిలవడం మొదలుపెట్టారు.

పార్టీల్లో మద్యంతో పాటు డ్రగ్స్, అమ్మాయిలు ఇలా.. చాలానే యవ్వారం జరుగుతుందని టాక్. ముఖ్యంగా యువత ఈ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ.. అశ్లీల నృత్యాలు చేయటం.. అదీ హద్దు మీరి శృంగార కార్యకలాపాలు జరుగుతాయని.. అన్నింటికీ అన్ని రకాలుగా రెడీ అయిన వాళ్లే ఈ పార్టీల్లో పాల్గొంటారని సమాచారం. సాధారణంగా ఈ రేవ్ పార్టీని బడాబాబుల ఫామ్ హౌసులోనో, గెస్ట్ హౌసుల్లోనో నిర్వహిస్తుంటారు. 24 గంటల నుంచి 3 రోజుల వరకు నిర్వహిస్తారని సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఫుడ్‌, కూల్‌డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లతో పాటు రకరకాల డ్రగ్స్‌ కూడా ఏర్పాటు చేస్తారట. ఇక.. కొన్ని రేవ్ పార్టీల్లో అయితే.. ప్రత్యేకంగా లైంగిక కార్యకలాపాలు కూడా మెనూలో ఉంటాయని తెలుస్తోంది. శృంగార కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా గదులు కూడా ఏర్పాటు చేస్తారంట. అందుకే ఈ పార్టీలు నిర్వహించే దగ్గర.. సీసీ కెమెరాలు ఆఫ్‌లోనే ఉంటాయి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ముందే తీసుకుంటారని చెప్తున్నారు.