Current Date: 26 Nov, 2024

జానీ మాస్టర్ భార్య ఆయేషా అరెస్ట్ తప్పదా

జానీ మాస్టర్ భార్య ఆయేషా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆయేషా తనపై దాడి చేసిందని అత్యాచార బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై మరోకేసు నమోదు చేసి ఆయేషాతో పాటు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఆయేషాను అరెస్టు చేయడం ఖాయమని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడిన సమయంలో బాధితురాలి వయసు 19 సంవత్సరాలని తేలడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గోవాలో ఆయనను అరెస్టు చేసిన పోలీసులు.. చంచల్ గూడ జైలుకు తరలించారు. శనివారం ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ని కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు పిటిషన్ వేయనున్నారు.

Share