Current Date: 21 Sep, 2024

అనిరుధ్‌తో కలిసి డ్యాన్స్‌ వేసిన రజనీకాంత్‌

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్‌ దర్శకత్వంలో కూలీ చిత్రంతో పాటు టి.జె. జ్ఞానవేల్‌ డైరెక్షన్‌లో 'వేట్టయాన్‌' చిత్రంలో నటిస్తున్నాడు. వీటిలో 'వేట్టయాన్‌' చిత్రం అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నయ్‌లో నిర్వహించారు‌. ఎంతో సందడిగా జరిగిన ఈ వేడుకలో రజనీకాంత్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ కలిసి వేసిన డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఆ ఫంక్షన్‌కు ఆకర్షణగా నిలిచాయి.  వేట్టయాన్‌లో నటిస్తున్న అమితాబ్ బబ్చన్‌ ఈ వేడుకకు హాజరుకాలేకపోయినా ఆయన వీడియో మేసేజ్‌ పంపారు. దాదాపు 30 సంవత్సరాల తరువాత రజనీకాంత్‌, అమితాబ్‌లు కలిసి ఈ సినిమాలో నటించడం విశేషం.

Share