Current Date: 06 Oct, 2024

సీఎం హోదాలో ఇవాళ సాయంత్రం తిరుమలకు చంద్రబాబు..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమల వెళ్లనున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్నారు. సాయంత్రం 6.45 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి 7.45 గంటలకు రేణిగుంట చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాత్రి 8.50 గంటలకు తిరుమల చేరుకుంటారు. రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం 7.30 గంటల నుంచి 8 మధ్య శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం బయలుదేరి అమరావతి చేరుకోనున్నారు.

Share