Current Date: 26 Nov, 2024

టీడీపీ ఎమ్మెల్యేపై ఎగిరిపోయిన రేప్ కేసు సస్పెన్షన్ కూడా ఎత్తివేత?

రేప్ కేసులో ఇరుక్కుని సస్పెండైన తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై రెండు వారాల వ్యవధిలోనే కేసు ఎగిరిపోయింది. హోటల్‌కి పిలిచి ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశారంటూ టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు ఇటీవల తిరుప‌తి ఈస్ట్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.బాధితురాలి ఫిర్యాదు మేర‌కు ఈస్ట్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. దాంతో ఆ ఎమ్మెల్యేని టీడీపీ సస్పెండ్ కూడా చేయగా.. అరెస్ట్ చేయ‌డానికి కూడా పోలీసులు ప్ర‌య‌త్నించారు. కానీ.. రోజుల వ్యవధిలోనే టీడీపీ పెద్ద‌ల జోక్యంతో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. త‌న‌పై కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్ప‌డ‌లేదని, త‌న ఫిర్యాదు అబ‌ద్ధ‌మ‌ని ఏపీ హైకోర్టుకు త‌న లాయ‌ర్ ద్వారా సదరు మహిళ తెలిపింది. దాంతో ఈస్ట్ పోలీసులు కేసును ఎత్తివేశారు.కేసు ఎగిరిపోవడంతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కూడా టీడీపీ ఎత్తివేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కావ‌డంతో లైంగిక దాడి కేసు కూడా ఏమీ కాలేద‌ని వైసీపీ విమర్శిస్తోంది.

Share