Current Date: 27 Sep, 2024

నటుడు మోహన్ బాబు ఇంట్లో మళ్లీ దొంగతనం

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌కి సమీపంలో జల్‌పల్లిలో మోహన్ బాబుకి ఫామ్ హౌస్ ఉంది. అందులో నాయక్ అనే వ్యక్తి పని మనిషిగా చేస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రూ.10 లక్షలు దొంగిలించి ఉడాయించాడు.రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేపట్టారు. డబ్బుతో తిరుపతికి పారిపోయిన నాయక్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  గతంలో ఇదే ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ వీడియోని మంచు లక్ష‍్మి తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది.విలాసవంతమైన ఈ ఇంటిలో దొంగతనం జరగడం ఇదే కొత్తం కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు జరిగాయి. మోహన్ బాబు.. చివరగా 'సన్నాఫ్ ఇండియా' చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం సొంత బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో 'కన్నప్ప' తీస్తున్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Share