Current Date: 27 Sep, 2024

మాకు రోడ్డు కావాలి

 అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం MK పట్టణం పంచాయతీ శివారు కొరుప్రోలు గ్రామంలో10 పది కుటుంబాలు Pvtg ఆదివాసి కోందు గిరిజనలు 50 మంది జనాభా కొండ ప్రక్కనే జీవిస్తూ ఉన్నారు. వీరితోపాటు కోతులు పాలెం గ్రామం ఎస్టి కొండ ధర చెందిన 30 కుటుంబాలు. Mk పట్టణం 40 కుటుంబాలు దళితులు కొరుపోలు గ్రామం వెనక వైపే వీరు భూములు ఉన్నాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గడ్డలు దాటుకుంటూ కాలుబట్టే ప్రయాణం చేస్తున్నారు. కొరుప్రోలు గ్రామం నుండి ఎంకే పట్నం గ్రామానికి వెళ్లాలంటే 3 కిలోమీటర్లు గడ్డలో నడుచుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. ఈమధ్య వర్షాకాలంలో మా గ్రామంలోని ఉండవలసి వచ్చింది. ఎందుకంటే ఊరు చుట్టూ గడ్డలు ప్రవహిస్తుండడంతో. నిత్యవసర వస్తువులు తెచ్చుకోవడం కూడా ఇబ్బంది పడ్డాం.ఒకటో తేదీ ఆగస్టు నెలఓ ఏపీ పెన్షన్ కోసం. డోలు కట్టుకొని mk పట్నం పంచాయతీ కేంద్రానికి తీసుకొని వెళితే 
వివిధ జాతీయ పత్రికలో ప్రచురించడంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ గారిని డోలి కట్టిన విషయంపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని అనకాపల్లి కలెక్టర్ గారి ఆదేశించారు.జిల్లా కలెక్టర్ గారుDRDA. పీడీ. Mpdo mro vro సచివాలయం సిబ్బంది గ్రామంలోకి వెళ్లి ఎంక్వయిరీ చేయడం జరిగింది. రోడ్డు లేకపోవడం వల్లే డోలు కట్టి వెళ్ళవలసి వచ్చిందని. అధికారి బృందానికి వివరించాము.  దీనితో3 మూడో తారీఖున పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఆగ మేఘాల మీద రోడ్డు ఏర్పాటు కోసం సర్వే చేశారు.సర్వే చేయడం కోసం.  జంగిల్ కటింగ్ 50 మంది గిరిజనులు  తప్పులో డొంకలో నరకడం జరిగింది    రోడ్డు నిర్మాణం చేయడం కోసం1 కోటి యాభై లక్షల రూపాయలకి ఉపాధి హామీ పథకం ద్వారా మెటీరియల్ కాంపినేట్ నిధుల నుండి ఎస్టిమేషన్ వేసి జిల్లా కలెక్టర్ గారికిపంపించడం జరిగింది.దీనికి మేము ఎంతో సంతోషం పడ్డాం. మరల నిన్నను తేదీ21  పంచాయతీరాజ్ (ప్రాజెక్ట్స్)డిప్యూటీ ఇంజనీర్. అసిస్టెంట్ ఇంజనీర్.మరొకసారి ఎస్టిమేషన్ కి వచ్చారు. ఇప్పటికే మొదట ఎటిమేషన్ వేసి నేటికీ 1 నెల 20 రోజులు గడుస్తుంది. కలెక్టర్ గారికి ఫైల్ పంపించామని చెప్తున్నారు. కలెక్టర్ గారు మాత్రం. రోడ్డుకి నిధులు మంజూరు చేయలేదు. గత 2018 నుండి ఇంజనీరింగ్ అధికారులు ఎస్టిమేట్లు వేస్తున్నారు తప్ప. రోడ్లకి నిధులు మంజూరు చేయడం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఉపాధి హామీ పథకం ద్వారా మెటీరియల్ కాంప్లిమెంట్ నిధుల నుండి ఎస్టిమేషన్ పంపించిన వాటికి రోడ్లు నిధులు మంజూరు చేసి. మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ గారిని వేడుకోవడం జరిగింది. ఈ నెల 30వ తేదీన జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం వద్ద రోడ్డు సమస్యలపై డోలి యాత్ర నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆదివాసి ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు కే గోవిందరావు. పి టి జి సంఘం నాయకులుK సుబ్బారావు కొర్ర ఆనంద్. పి టి జి సంఘం మండల కార్యదర్శి గేమిల వాసు తదితరులు పాల్గొన్నారు
 

Share