Current Date: 26 Nov, 2024

ఢిల్లీలోని యమునా నదిలో విషపు నురగ

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో యమునా నదిపై ప్రమాదకరమైన తెల్లటి నురగ చేరింది. దీంతో యమునా పరిసర ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యం, వన్య ప్రాణులను ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛత్ పూజ సమీపిస్తున్నందున కాలుష్య నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. శ్వాసకోశ, చర్మ సమస్యలతో సహా, మరిన్ని అనారోగ్యాలను కలిగించేలా అమ్మోనియా ఫాస్ఫేట్‌లను కలిగిఉన్న నురుగు యమునా నీటిలో అధికంగా ఉంది. కుళ్లిపోయిన మొక్కలు, కాలుష్య కారకాలు నీటిలో కలిసినప్పుడు నురగ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం వరదలు లేకపోవడం వల్ల కాలుష్య కారకాలు నదిలో ఉండడం వల్ల నురుగు ఏర్పడిందని నిపుణులు భావిస్తున్నారు.

Share