Current Date: 26 Nov, 2024

చరిత్ర సృష్టించిన అమరావతి డ్రోన్ షో ఆకాశంలో అద్భుతం ఐదు ప్రపంచ రికార్డులు కైవసం.

అమరావతి డ్రోన్ సమ్మిట్ – 2024 లో భాగంగా ఈ సాయంత్రం పున్నమి ఘాట్ లో డ్రోన్ షో, లేజర్ షో, ఫైర్ వర్క్స్, సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ  డ్రోన్ షో ను  ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆకాశపు కాన్వాస్‌పై డ్రోన్లు గీసిన చిత్రాలు అబ్బురపరిచాయి. దేశంలోనే అతి పెద్ద డ్రోన్‌ షో అదరహో అనే రేంజ్‌లో జరిగింది. కృష్ణా తీరంలో పున్నమి ఘాట్‌లో…పున్నమి వెలుగులను మించి డ్రోన్‌ హ్యాకథాన్‌ జరిగింది. ఒకటి కాదు రెండు కాదు.ఒకేసారి 5,500 డ్రోన్లు వెలుగులు విరజిమ్మూతూ ఆకాశంలోకి దూసుకెళ్లి పలు థీమ్‌లను ఆవిష్కరించాయి. దేశంలోనే అతి పెద్ద డ్రోన్‌ షోకి విజయవాడ వేదికగా మారింది. ఆకాశంలో చుక్కలు కుప్పబోసినట్లు…నక్షత్రాల్లా మిలమిలా మెరిసిపోయాయి డ్రోన్లు. డ్రోన్ల తళుకుబెళుకుల ముందు నక్షత్రాలు చిన్నబోయాయి. ఇక ఈ డ్రోన్ షో ద్వారా అమరావతిలో ఒకే రోజు ఐదు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. డ్రోన్ షో, లేజర్ షో అనంతరం సీఎం చంద్రబాబు నాయుడుకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ రికార్డులకు సంబంధించిన పత్రాలు అందించారు.

Share