Current Date: 28 Nov, 2024

టీడీపీ నుంచి ఎమ్మెల్యే ఆదిమూలం సస్పెన్షన్‌ లైంగిక వేధింపుల ఆరోపణలపై అధిష్ఠానం సీరియస్‌

తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ మహిళ లేఖ రాశారు. ఎమ్మెల్యే వేధింపులను పెన్‌ కెమెరాలో రికార్డు చేసినట్లు ఆమె తెలిపారు. రాత్రి వేళల్లో మెసేజ్‌లు పంపి వేధించారని లేఖలో పేర్కొన్నారు. తిరుపతిలోని భీమా ప్యారడైజ్‌ హోటల్‌కు పిలిపించి వేధించారని తెలిపారు. ఈ ఘటనను టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడిరచారు. దీనిపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Share