Current Date: 06 Jul, 2024

ఢిల్లీ పోలీసుల నోటీసులకి సీఎం రేవంత్ వివరణ

అమిత్ షా ఫేక్ వీడియో అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చేవెళ్ల బహిరంగ సభలో ప్రసంగించిన అమిత్ షా.. తాము మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యంగవిరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పారు. అయితే ఆయన కామెంట్లను వక్రీకరిస్తూ.. రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా అంటున్నారని  కాంగ్రెస్ ప్రచారం చేసింది. దాంతో  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపారు. ఎట్టకేలకి ఈ నోటీసులపై రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు.

అమిత్ షా ఫేక్‌ వీడియో వైరల్ కావటానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ పోలీసులకు రేవంత్ సమాధానం పంపించారు. ఆ వీడియో పోస్టు చేసిన కాంగ్రెస్ తెలంగాణ ట్విట్టర్ ఖాతాను తాను నిర్వహించడం లేదని చెప్పారు. తాను కేవలం సీఎంవో తెలంగాణ, వ్యక్తిగత ఖాతా మాత్రమే వినియోగిస్తున్నానని ఢిల్లీ పోలీసులకు రేంత్ సమాధానం పంపారు.

ఈ కేసులో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడం చూసి యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందని బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. ఫేక్ వీడియోల వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.