Current Date: 06 Jul, 2024

ఈ వార్త వింటే మీరు జీవితంలో సిగరెట్ ముట్టరు!

కొంత మంది మాత్రంరోజూప్యాకెట్లకొద్దీసిగరెట్లు,బీడీలు తాగేస్తుంటారు. ఎంత భయానక పరిస్థితి? ఒక్కసారి ఊహించుకుంటేనే ఒళ్లు జలధరిస్తుంది. సిగరెట్ తాగేవాళ్లకు ఎంత ప్రమాదమో, వారికి సమీపంలో ఉండే వారికి కూడా అంతే ప్రమాదం. సిగరెట్ తాగడం ఎంత భాయానక అనర్థమో, దాని వల్ల తాను ఏమేం కోల్పోయానో వివరిస్తూ సీనియర్ జర్నలిస్టు, బ్లాగర్ నవీన్ ఆర్‌జేవై ఓ పోస్టు పెట్టారు.14 ఏళ్ల పాటుసిగరెట్ల సంఖ్య పెంచుకుంటూపోయాను. చివరికి రోజుకి 40-45కి చేరాయి. నిద్రపోయేముందు కూడా పక్కన ఒక పేకెట్లేకపోతేఏదోఅభద్రత.మెళకువవచ్చేస్తేకాల్చుకోడానికి లేకపోతేఎలాఅని.అప్పట్లోనేకొన్నిసార్లుమానేశాను. అయినదానికీ, కానిదానికీ చికాకు పడిపోతున్న నన్ను చూసి రెండో రోజుకే ‘‘పిల్లలు బెంబేలు పడుతున్నారు. నువ్వుకాల్చేసుకునిమమ్మల్నీకాల్చెయ్యి’’అనివిసుక్కునేది.ఇంట్లోకూర్చునిమాట్లాడేఫ్రెండుఒకరోజుబాల్కనీలోనే కూర్చున్నాడు. లోపలికి రమ్మంటే, నీ ఇల్లంతా సిగరెట్ల వాసన అన్నాడు. అవమానం అనిపించింది. ఎప్పుడో వచ్చే అతనికే అలా ఉంటే.. ఇంట్లోని పెళ్లాం, పిల్లల పరిస్థితి ఆలోచించి నాపై నాకే చిరాకేసింది. అలా కాల్చి కాల్చి.. గుండెను బలహీన రచుకున్నాను. 2005 సెప్టెంబర్ 25న ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారి ప్రోగ్రాం కవర్చేస్తుండగా..మాసివ్హార్ట్ఎటాక్వచ్చింది. అందరి మధ్యలో ఉన్న సమయం కాబట్టి, ఫెలో జర్నలిస్టులు నా డాక్టర్ ఫ్రెండ్ దగ్గరకి మోసేశారు. స్టెంట్ వేశాడు.దెబ్బకి ఆ రోజే స్మోకింగ్ మానేశాను. ఇదంతా కాదుగానీ సిగరెట్ల వల్ల నా క్వాలిటీ లైఫ్ పోయింది. స్మోకర్లుఆలోచించుకోడానికేనాఅనుభవాన్ని ఇక్కడ ఉంచుతున్నాను. స్మోకింగ్ తగ్గిస్తాము అంటే అది కుదిరేపని కాదు. ఆకస్మికంగా మానేయడం అసాధ్యం కాదు. అందుకు నేనే ఒక సాక్ష్యంజీవనశైలిని పాటించాలని ప్రజలను చైతన్యం చేసేందుకు ఏటా ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’ నిర్వహిస్తారు. ధూమపానం, పొగాకు వాడకం శరీరానికి చాలా అనారోగ్యం. ఇది క్యాన్సర్ సహా అనేక వ్యాధులకు దారితీస్తుంది. జర్నలిస్టు నవీన్ గారి అనుభవం విన్నాకైనా.. కాస్త ఆలోచిస్తారని..!