Current Date: 05 Oct, 2024

గాల్లో ఢీకొన్న విమానాలు...పైలట్‌ మృతి . ఎయిర్‌ షోలో అపశ్రుతి

బెజ, జూన్‌ 3 : దక్షిణ పోర్చుగల్‌ జరుగుతున్న ఎయిర్‌ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. విన్యాసాలు ప్రదర్శిస్తున్న సమయంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ పైలట్‌ మృతి చెందగా, మరో పైలట్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బెజలో జరుగుతున్న ఎయిర్‌ షోలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం ఆరు విమానాలు  విన్యాసాలు ప్రదర్శిస్తుండగా  ఒకటి వేగంగా పైకి దూసుకెళ్లి  మరోదాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒకటి ఎయిర్‌ బేస్‌ కు ఆవల పడగా, మరొకటి సమీపంలో కుప్పకూలింది. విచారణ జరిపి ప్రమాదానికి దారి తీసిన కారణాలేంటో గుర్తిస్తామని  పోర్చుగల్‌ రక్షణ మంత్రి  నునో మెలో తెలిపారు.