Current Date: 27 Nov, 2024

మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్.. కారణమిదే!

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వాట్సాప్ నిలిచిపోయింది. గత కొన్ని రోజులుగా నారా లోకేష్ వాట్సాప్‌కు వేలాదిగా మెసేజ్‌లు వస్తుండటంతో వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా అకౌంట్‌ను బ్లాక్ చేసింది. దాంతో తన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యిందని చెప్పుకొచ్చిన నారా లోకేష్.. సమస్యలు చెప్పుకునేందుకు మెయిల్ చేయాలని సూచించారు. ఈ మేరకు [email protected] అనే మెయిల్‌ ఐడీని వెల్లడించారు.మెయిల్స్ ద్వారా వచ్చిన సమస్యలను తానే నేరుగా చూస్తానని లోకేష్ స్పష్టం చేశారు. పేరు, గ్రామం, సెల్ నెంబర్, మెయిల్ ఐడీ, వారికి ఉన్న సమస్య, కావాల్సిన సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలు మెయిల్‌ ద్వారా పంపించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన యువగళం పాదయాత్రలో భాగంగా ‘హలో లోకేష్’ కార్యక్రమం చేపట్టిన నారా లోకేష్ ఆ పేరుతోనే ఈ మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోవడం గమనార్హం. ఇటీవల కొందరు విద్యార్థుల సమస్యలను లోకేష్ పరిష్కరించడంతో.. ఈ మెసేజ్‌లు మరింత పెరిగిపోయాయి. తమ సమస్యలు కూడా పరిష్కరించాలని ప్రజలు మెసేజ్‌లు పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా మెసేజ్‌లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేష్ వాట్సప్‌ను మెటా బ్లాక్ చేసింది.

Share