Current Date: 25 Nov, 2024

ఎరుపు జెండాకు కురుపు

 రంగు వెలిసిపోతోందిదళితుల అసైన్డ్‌ భూములు దళారీల పాల కిక్కురు మనని కమ్యూనిస్టులు నిరుపేదలు, అభాగ్యులు, అన్నార్తులు, దళిత గిరిజనుల హక్కులు అనే మాట వినపడగానే గుర్తుకు వచ్చేవి కమ్యూనిస్టు పార్టీలు, ఎర్ర జెండానే వారికి కొండంత అండ. నిస్వార్ధంగా వారి పక్షాన అలుపెరగని పోరాటాలు చేసేవీకూడా ఆ పార్టీలే. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నాయకుల్ని గడగడలాడేవి. అలాంటిది ఈనాటి కమ్యూనిస్టు నాయకులు ప్రభుత్వ పెద్దల్ని చూసి గజగజలాడుతున్నారన్నది అతిశయోక్తి కాదు. రోజు రోజుకూ రంగు వెలుస్తున్న ఎర్ర జెండా వైసీపీ అధికారంలోకి వచ్చాక రూపు మారిపోయింది. ఏదో మొక్కుబడి ఉద్యమాలు తప్ప, కాలెండర్‌ ప్రకారం చేసే సమ్మెలు తప్ప సమస్య వచ్చినప్పుడు గతంలో మాదిరిగా వెంటనే స్పందించి ముందుండి ఉద్యమాన్ని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమం కూడా రోజులు లెక్క పెట్టుకొని చేస్తున్నారు తప్ప ఫలితాన్ని మాత్రం సాధించలేకపోయారు.వేల కోట్ల రూపాయల విలువైన అసైన్డ్‌ భూములు దళారీల పాలు అవుతుంటే పట్టించుకోరా?
రాష్ట్రంలో నక్సల్చరీ ఉద్యమానికి ఊపిరి ఊదిన ఉత్తరాంధ్రా జిల్లాలలో వేల కోట్ల రూపాయల విలువ చేసే వేలాది ఎకరాల దళితుల అసైన్డ్‌ భూముల్ని జీవో 596 ముసుగులో దళారీలు కారు చౌకగా కాజేస్తున్నారు. అధికారంలో వున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున బాహాటంగానే దళారులకు కొమ్ము కాస్తున్నారు. భారీగా సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు సాక్ష్యాధారాలతో సహా బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో అధికార వైసీపీ పెద్దలు,  ఐఏఎస్‌ అధికారులు, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటు పలు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, మేధావులు దీనిపై తీవ్రంగా స్పందించి కేంద్ర ఎస్‌ సీ కమీషన్‌ నుంచి రాష్ట్ర గవర్నర్‌ వరకూ ఫిర్యాదులు చేశారు. విచిత్రంగా పేదలకు అండగా నిలబడాల్సిన సీపీఐ,  సీపీఎంలు మాత్రం దీనిని అతి ప్రధాన సమస్యగా ఇంకా గుర్తించకపోవడం విశేషం.ఆలస్యంగా మొక్కుబడి ప్రెస్‌ నోట్‌తో సరి..సమస్య బహిర్గతం అయిన  ఐదు రోజుల తరువాత సీపీఎం తాపీగా దీంతో పాటు పలు సమస్యలను కలిపేసి కలగాపులగంగా ఒక పత్రికా ప్రకటనను బుధవారం విడుదల చేసి మమ అనిపించేసింది. సీపీఐ అయితే ఇప్పటి వరకూ ఆ పని కూడా చేయలేదు. ఉదయం లేచిన దగ్గరి నుంచి పేదలు, కూలీలు, రైతులుఅంటూ హడావుడి చేసే ఈ  ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రంలో 60 వేల ఎకరాలకు పైగా దళితుల అసైన్డ్‌ భూములు దళారుల చేతుల్లోకి పోతున్నా నిమ్మకు నీరొత్తినట్టు కూర్చున్నాయి. ఇంత సీరియస్‌ సమస్యను గుర్తించకపోవడాన్ని, పట్టించుకోకపోవడాన్ని ఏమనాలో? ఎర్ర జండా వెలిసిపోయిందా? కమ్యూనిస్టులు సామాజిక స్ప్రహ కోల్పోయారా? ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ఎర్ర‘దండు’ దగాపడ్డ దళితులకు ఏం సమాధానం చెప్తుందో చూడాల్సిందే!