Current Date: 06 Oct, 2024

వైయస్ జగన్‌కు టాలీవుడ్ హీరోయిన్ ఉచిత సలహా!

హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది. అయితే గత కొన్ని నెలలుగా సినిమాయేతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోందీ అందాల తార.ఏపీ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని పూనమ్ చేసే ట్వీట్లు నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆమె ‘గత ఎన్నికల్లో జగన్ విజయానికి భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిలది కీలకపాత్ర. వారు తమదైన మార్గాల్లో సహనం, పట్టుదలతో అండగా నిలిచారు. ఇప్పుడు వారంతా కలిసుండాలని కోరుకుంటున్నా’ అని పూనమ్ ట్వీట్ చేసింది.పూనమ్ కౌర్‌ను గతంలో పవన్ కళ్యాణ్‌తో ముడిపెడుతూ వైసీపీ సోషల్ మీడియా తెగ హడావుడి చేసింది. 

Share