Current Date: 08 Feb, 2026

కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాయం.. డిజిటల్ డిటాక్స్ చేశాడా?

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అకస్మాత్తుగా మాయమవ్వడం సంచలనంగా మారింది. సుమారు 274 మిలియన్ల ఫాలోవర్లతో ఆసియాలోనే అత్యధిక ఫాలోయింగ్ కలిగిన అథ్లెట్‌గా ఉన్న కోహ్లీ ప్రొఫైల్ కనిపించకపోవడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. కోహ్లీ అకౌంట్‌ను సెర్చ్ చేస్తే "దిస్ పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్" అనే ఎర్రర్ మెసేజ్ కనిపిస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాంకేతిక లోపమా, హ్యాకింగ్‌కు గురైందా లేదా ఆయనే స్వయంగా డిజిటల్ డిటాక్స్ కోసం కోహ్లీ డీయాక్టివేట్ చేసుకున్నారా అనే చర్చ నడుస్తోంది. దీనిపై క్లారిటీ కోసం అభిమానులు కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మకు నెటిజన్లు మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు విరాట్ కోహ్లీ గానీ, ఆయన మేనేజ్‌మెంట్ గానీ అధికారికంగా స్పందించలేదు. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత సెంచరీతో రాణించి ఐసీసీ నంబర్ వన్ ర్యాంకును దక్కించుకున్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. టీమిండియా వన్డే మ్యాచ్‌లు ఆడే సమయంలో మాత్రమే భారత్‌కి వస్తున్న విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత లండన్‌కు వెళ్లిపోతున్నాడు. అతని ఫ్యామిలీ కూడా ప్రస్తుతం అక్కడే ఉంది.