రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం బయల్దేరి వెళ్లారు. ఈసందర్భంగా ఇద్దరు నేతలు 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రష్యాతో పాటు ప్రధాని ఆస్ట్రియాకు వెళ్తారు. బయల్దేరడానికి ముందు మోదీ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు. ‘‘రానున్న మూడు రోజులు రష్యా, ఆస్ట్రియాలో పర్యటిస్తాను. కాలం పెట్టిన పరీక్షలకు నిలిచిన స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ సందర్శనలు ఉపయోగపడనున్నాయి. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో మాట్లాడేందుకు వేచి చూస్తున్నా’’ అని తెలిపారు. కాగా, 40 ఏళ్ల కాలంలో ఆస్ట్రియాలో పర్యటిస్తున్న తొలి ప్రధాని మోడీనే కావడం విశేషం.