బయటకు అడుగుపెట్టాలంటే చెప్పులు ఉండాల్సిందే. వాకింగ్ చేస్తున్నప్పుడు, దగ్గర్లోని షాపుకు వెళ్లాలంటే చెప్పుల్లేకుండా అడుగువేయం. కొందరైతే ఇంట్లో కూడా చెప్పులు ఉపయోగిస్తారు. ఇలా పొద్దున్న నిద్రలేచిన సమయం నుంచి మళ్లీ రాత్రి పడుకునే వరకూ కాళ్ళకి చెప్పులు వేసుకునే అన్ని పనులు చేస్తాం.కోలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ చెప్పులు లేకుండా కనిపించారు. అంతేకాకుండా భవిష్యత్‌లో కూడా చెప్పులో వేసుకోనని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. అతను నటిస్తున్న తాజా చిత్రం 'తుఫాన్' టీజర్ విడుదల కార్యక్రమంలో విజయ్ అంటోని పలు విషయాలను పంచుకున్నాడు. వేదిక మీదు చెప్పులు లేకుండా విజయ్ కనిపించడంతో ఏదైనా దీక్షలో ఉన్నారా అని మీడియా వారు ప్రశ్నించారు. అందుకు ఆయన ఇలా చెప్పాడు.నేను ఎలాంటి దీక్షలో లేను. సుమారు 3 నెలల నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నాను. దీనికి ప్రత్యేకమైన కారణం లేదు. ఒకరోజు నేను చెప్పులు లేకుండా తిరిగాను. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడామంచిదే.అంతేకాకుండా మనలో కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది. ఎప్పుడైతే నేను చెప్పులు లేకుండాతిరగడంప్రారంభించానోఆసమయం నుంచి నేను ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు.జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాను’ అన్నారు.