ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డితో కలిసి సాధారణ ప్రయాణికుల్లా విమానంలో వెళ్లారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఎలాంటి హడావిడి లేకుండా ఇలా సింపుల్గా అందరితో కలిసి ప్రయాణించడం ఆసక్తికరం గామారింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ ప్రత్యేక విమానాల్లో ఎక్కువగా ప్రయాణించించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు సామాన్యుడిలా సాధారణ విమానాల్లో ప్రయాణిస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ జగన్ తాడేపల్లిలో నాలుగు రోజులు.. బెంగళూరులో వీకెండ్ రెండు రోజులు అన్నట్లు పర్యటిస్తున్నారు.
Share