వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో భాగంగా అంబులెన్స్‌లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి నిత్యావసరాలు అందజేయాలి. 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళదుంపలు, కిలో చక్కెర ఇవ్వాలి. మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకు కూరగాయలు అందజేయాలి. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారాన్ని ప్రభుత్వం తరఫున అందించాలి’’ అని చంద్రబాబు తెలిపారు.