Current Date: 28 Nov, 2024

ఐశ్వర్యరాయ్ విడాకులకు ఆ హీరోయిన్ కారణమా ?

బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా వీరి విడాకులపై మరో వాదన తెర మీదకు వచ్చింది.ఐశ్వర్య, అభిషేక్ విడిపోవడానికి సీనియర్ నటి రేఖ కారణం అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీనియర్ నటి రేఖ అమితాబ్ ఇంట విభేదాలకు కారణం అని నెటిజన్లు అంటున్నారు. అమితాబ్, రేఖ ఒకప్పుడు హిట్ పెయిర్. ఆ సమయంలో వీరిద్దరు ప్రేమించుకున్నారని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారని వార్తలు వచ్చాయి. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, అమితాబ్, రేఖల మధ్య ఇప్పుడు మాటల్లేవు. ఇదే సమయంలో నటి రేఖ ఎక్కడైన కనిపిస్తే చాలు అమితాబ్ భార్య జయబచ్చన్ ఆగ్రహంగా ఉన్నట్టు కనిపిస్తుంటారు. దీంతో అమితాబ్, రేఖల మధ్య దూరం పెరిగిపోయింది.అలాంటిది రేఖతో ఐశ్వర్యరాయ్ క్లోజ్‌గా మాట్లాడుతూ అంబానీ పెళ్లిలో కనిపించింది. దీని కారణంగానే ఐశ్వర్య, అభిషేక్ విడిపోవడానికి రేఖనే కారణమని నెట్టింట పలు చర్చలు మొదలయ్యాయి.

Share