వైనాట్ 175 అని డాంబికాలు పలికిన వైయస్‌ఆర్‌సీపీ 11 సీట్లకే పరిమితమై చరిత్రలో కనివినీ ఎరుగని పరాజయాన్ని మూటగట్టుకుంది. అధికారంలో ఉన్నప్పుడు నోరేసుకుని పడిపోయినవారు ఇప్పుడు మొహం కూడా చూపించకుండా దాక్కుంటున్నారు. ఆఖరికి ఆ పార్టీ అధినేత సైతం గత వారం నుంచి ఎవరికీ కనిపించకుండా సీక్రెట్ మెయింటెన్ చేస్తున్నారు.జూన్ మూడో వారంలో పులివెందుల నుంచి రోడ్డు మార్గంలో బెంగళూరుకు వెళ్లిన వైయస్ జగన్.. అప్పటి నుంచి బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో ఉంటున్నారు. గత వారం రోజులుగా ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు కూడా జగన్ చేయలేదు. మరి ఏం చేస్తున్నారు అక్కడ అంటే? ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.వచ్చే ఐదేళ్లపాటు జగన్ బెంగళూరులోనే ఉండి పార్టీని, రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తాడేపల్లిలో ఆయనపై ప్రభుత్వ నిఘా ఉంటుంది. అలాగే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీడీపీకి అనుకూలమని భావించి హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయడం సురక్షితం కాదని జగన్ భావిస్తున్నారు. దాంతో బెంగళూరును వేదికగా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.