Current Date: 07 Oct, 2024

ఇకపై సినిమాల్లో అలాంటి సన్నివేశాలు ఉండకూడదు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

అవిటివాడు, స్పాస్టిక్ వంటి పదాలు వారిని సామాజిక వివక్షకు గురయ్యేలా చేస్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ నేప‌థ్యంలో సినిమాలు, దృశ్య మాధ్యమాల్లో దివ్యాంగులను కించపరిచేలా సన్నివేశాలను చిత్రీకరించడాన్ని వ్యతిరేకిస్తూ దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సోమవారం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. సినిమా స్క్రీనింగ్‌కు అనుమతించే ముందు సర్టిఫికేట్ ఇచ్చే సీబీఎఫ్‌సీ నిపుణుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. దివ్యాంగులపై వాస్తవాలను చిత్రీకరించడానికి దృశ్య మీడియా కృషి చేయాలని తెలిపింది. అలాగే దివ్యాంగుల సవాళ్లను మాత్రమే కాకుండా వారి విజయాలు, ప్రతిభ, సమాజానికి చేసిన సేవను చూపించాలని న్యాయ‌స్థానం పేర్కొంది.

Share