Current Date: 26 Nov, 2024

ఎంపీ ఉండగానే పెళ్లి చేసుకుంటానన్న హీరోయిన్ కంగనా రనౌత్

బాలీవుడ్‌లో వివాదాలకి కేరాఫ్ అడ్రస్ హీరోయిన్ కమ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్. ఆమె నటించిన ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ వాయిదాలు పడుతోంది. దాంతో అప్పులపాలైన కంగనా ఆస్తులను అమ్ముకుంటోంది. అయినప్పటికీ సినిమా ప్రమోషన్స్ మాత్రం ఆపడం లేదు. ఏదో ఒక వివాదంపై మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తోంది.కంగనాకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ప్రశ్న ఎదురరైంది. ‘ఎంపీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంటారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా  ‘దేవుడి దయ వల్లే అదే జరగాలని కోరుకుంటున్నాను. ఎంపీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఈ పదవి కాలం ముగిసిన తర్వాత పెళ్లి చేసుకున్న ఏం లాభం’ అని కంగనా నవ్వేసింది.బీజేపీ తరఫున 2024 ఎన్పికల్లో కంగనా గెలిచింది  2029 వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ‘ఎమర్జెన్సీ’ మూవీ సెప్టెంబర్‌ 6న రిలీజ్‌ కావాల్సింది. కానీ సెన్సార్‌ సర్టిఫికేట్‌ రాకపోవడంతో విడుదల వాయిదా వేశారు. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనున్నారు.

Share