Current Date: 06 Oct, 2024

జైలు నుంచి బయటికి వచ్చాక ఎమ్మెల్సీ కవిత మాస్ వార్నింగ్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 5 నెలలు జైలు శిక్ష అనుభవించిన ఎమ్మెల్సీ కవిత మంగళవారం రాత్రి బెయిల్‌పై విడుదల అయ్యారు. తీహార్ జైలు వద్ద కవితను రిసీవ్ చేసుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా వెళ్లారు. జైలు నుంచి పిడికిలి బిగించి బయటకు వచ్చిన కవిత.. మొదట తన కుమారున్ని చూడగానే గట్టిగా హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత భర్తను కూడా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నేను మొండిదాన్ని. అనవసరంగా నన్ను జగమొండిగా మార్చారు. 5 నెలల తర్వాత మీ అందరినీ మళ్లీ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. 18 ఏళ్ల రాజకీయంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. నన్ను అనవసరంగా జైలులో పెట్టి ఇబ్బంది పెట్టినందుకు వాళ్లు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. నన్ను అన్యాయంగా జైలులో పెట్టినవాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తాం.. ఆ సమయం త్వరలోనే వస్తుంది. మేము ఫైటర్స్. న్యాయంగా పోరాడతాం. ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టిగా పోరాడతాం. కమిట్మెంట్‌తో పని చేస్తాం. చట్టబద్దంగానే కాకుండా రాజకీయ పరంగానూ పోరాడతాం. బీఆర్ఎస్ అండ్ కేటీఆర్ టీం అన్-బ్రోకబుల్’ అని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. 

Share