ప్రధాని నరేంద్ర మోదీని సోదరుడిగా భావించి పాకిస్థాన్‌కు చెందిన ఖమర్ షేక్ రాఖీ కట్టబోతున్నారు. రక్షాబంధన్ రోజున ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు ఢిల్లీకి ఆమె టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. మోడీకి కమర్ షేక్ రాఖీ కట్టడం ఇదేమీ తొలిసారి కాదు. ఇప్పటికే 29 సార్లు రాఖీ కట్టింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. కమర్ షేక్ పాకిస్థాన్ కరాచీ నగరంలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. 1981 సంవత్సరంలో మొహ్సిన్ షేక్‌ను వివాహం చేసుకుని భారత్‌లోనే ఫ్యామిలీతో స్థిరపడింది. ఇక 1990 నుంచి మోడీతో ఆమె టచ్‌లో ఉన్నారు. మోడీ కూడా ఆమెను సొంత సోదరిగా భావిస్తారు. కరోనా టైమ్‌లో మినహా ఏటా మోడీకి ఆమె రాఖీ కడుతూ వస్తోంది. ప్రతి సంవత్సరం రక్షాబంధన్‌కి ముందు తన చేతులతో రాఖీలు తయారు చేస్తానని ఆమె అన్నారు. రాఖీలో ముత్యాలు, మోతీ, జర్దోసీ, టిక్కీలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. రక్షాబంధన్‌కు ఒకరోజు ముందు ఆగస్టు 18న రాఖీ కట్టేందుకు ఆమె ఇప్పటికే ఢిల్లీకి టికెట్ కూడా బుక్ చేసుకున్నారు.
Share